Nagara geetham by jaisaideep

ntrsai1222 1,525 views 38 slides Dec 25, 2015
Slide 1
Slide 1 of 38
Slide 1
1
Slide 2
2
Slide 3
3
Slide 4
4
Slide 5
5
Slide 6
6
Slide 7
7
Slide 8
8
Slide 9
9
Slide 10
10
Slide 11
11
Slide 12
12
Slide 13
13
Slide 14
14
Slide 15
15
Slide 16
16
Slide 17
17
Slide 18
18
Slide 19
19
Slide 20
20
Slide 21
21
Slide 22
22
Slide 23
23
Slide 24
24
Slide 25
25
Slide 26
26
Slide 27
27
Slide 28
28
Slide 29
29
Slide 30
30
Slide 31
31
Slide 32
32
Slide 33
33
Slide 34
34
Slide 35
35
Slide 36
36
Slide 37
37
Slide 38
38

About This Presentation

Nagara geetham by jaisaideep from 10-A, Jawahar navodaya vidyalaya, Udayagiri-A house, Lepakshi, 9441025173, Andhra Pradesh, India, Earth, Universe, Milky way.


Slide Content

తెలుగు దసరా, దీపావళి సెలవుల ఇంటిపని విషయం : ‘నగరగీతం ’ పద్యభాగం

‘ నగరగీతం ’ - అలిశెట్టి ప్రభాకర్

కవి పరిచయం - అలిశెట్టి ప్రభాకర్ అలిశెట్టి ప్రభాకర్ జననం - అలిశెట్టి ప్రభాకర్ 1956, జనవరి 12 కరీంనగర్ జిల్లాలోని జగిత్యాల . మరణం - 993 , జనవరి 12 వృత్తి - చిత్రకారుడు , ఫోటోగ్రాఫర్ ప్రసిద్ధి - కవి మతం - హిందూ

అలిశెట్టి ప్రభాకర్ కరీంనగర్ జిల్లాలోని జగిత్యాల లో 1956 జనవరి 12 న పుట్టారు. అలిశెట్టికి ఏడుగురు అక్కా చెల్లెళ్ళు, ఇద్దరు అన్నదమ్ముళ్ళు. తండ్రి పరిశ్రమల శాఖలో పని చేస్తూ ఆకస్మికంగా మృత్యువాత పడ్డాడు. ఆయన మరణంతో 11 ఏళ్ల వయసులో ప్రభాకర్ కుటుంబ పోషణ బాధ్యతలు స్వీకరించాడు. ఆదర్శాలకు అనుగుణంగా పేదరాలయిన 'భాగ్యం' ను పెళ్లి చేసుకొన్నారు. జీవిక కోసమే తప్పా, ఏనాడు సంపాదన కొరకు ఆరాటపడని మనిషి. తన కళ ప్రజల కోసమే అని చివరి వరకు నమ్మాడు. చిత్రకారుడిగా, ఫోటో గ్రాఫర్‌గా వృత్తి జీవితాన్ని కొనసాగిస్తూనే, కవిగా ఎదిగాడు. 1982 లో హైదరాబాదు లో స్థిరపడ్డారు. ఆంధ్రజ్యోతి దినపత్రికలో ఆరేళ్ళ పాటు సీరియల్‌గా సిటీ లైఫ్ పేరుతో హైదరాబాద్ నగరంపై మినీ కవిత్వం రాశాడు. తన కవిత్వంతో పాఠకుల్లో ఆలోచనాదృక్పథాన్ని, సామాజిక చైతన్యాన్ని పెంపొందించిన అతి కొద్ది మంది కవుల్లో అలిశెట్టి ఒకడు. క్షయ బారిన పడి 1993 జనవరి 12న మరణించారు . ఆయన మొదట చిత్రకారుడిగా జీవితాన్ని ప్రారంభించాడు. ప్రారంభంలో పత్రికలకు పండుగలు, ప్రకృతి, సినీనటుల బొమ్మలు వేసేవాడు. సిరిసిల్లలో రాం ఫోటో స్టూడియోలో ఫోటోగ్రఫీ నేర్చుకొని, 1975 లో జగిత్యాలలోని సొంత ఇంట్లో పూర్ణిమ స్టూడియో ప్రారంభించాడు. కరీంనగర్‌లో స్టూడియో శిల్పి(1979), హైదరాబాద్లో స్టూడియో చిత్రలేఖ(1983) పేర్లతోనూ స్టూడియోలు నడిపి ఫోటో గ్రాఫర్‌గా జీవితాన్ని గడిపాడు. జగిత్యాలలో సాహితీ మిత్ర దీప్తి సంస్థ పరిచయంతో కవిత్వ రంగంలో ప్రవేశించాడు. 1974 లో ఆంధ్ర సచిత్ర వారపత్రికలో వచ్చిన పరిష్కారం అచ్చైన ఆయన మొదటి కవిత. ఎర్ర పావురాలు(1978) అచ్చైన ఆయన మొదటి కవితా సంకలనం. ఆంధ్రజ్యోతి దినపత్రికలో ఆరేళ్ళ పాటు సీరియల్‌గా సిటీ లైఫ్ పేరుతో హైదరాబాద్ నగరంపై రాసిన మినీ కవితలతో ప్రఖ్యాతిపొందాడు. సామాజిక చైతన్యమే ధ్యేయంగా కవిత్వం రాశాడు.

అచ్చైన కవితా సంకలనాలు :- ఎర్ర పావురాలు (1978) మంటల జెండాలు (1979) చురకలు (1981) రక్త రేఖ (1985) ఎన్నికల ఎండమావి (1989) సంక్షోభ గీతం (1990) సిటీ లైఫ్ (1992)

ప్రసిద్ధ కవితలు :- తనువు పుండై... తాను పండై...తాను శవమై...వేరొకరి వశమై...తను ఎడారై ... ఎందరికో.. ఒయాసిస్సై.... అంటూ సెక్స్ వర్కర్ల దయనీయ స్థితి గురించి ఆయన రాసిన కవిత సుప్రసిద్దమైనది. వేశ్యల గురించి ప్రస్తావన వచ్చిన అనేక సందర్భాలలో అనేక మందిచే ఉదహరింపబడిన కవిత. హృదయ త్రాసు కవిత ఆయనకు కవిగా మంచి పేరు తెచ్చినదే. ఉదహరింపు కవిత లో ఇలా అంటారు శిల్పం చెక్కకముందు బండ శిక్షణ పొందకముందు మొండి ప్రతిభ వెనకాల ఎంతో ప్రయాస సో....... కాలానికి వదలకు భరోసా ప్రతిభలేకపోతే జీవితం వ్యర్థం అని, సాధన చేస్తేనే బండ శిల్పంగా మారుతుందని, కాలానికి వదిలేయకుండా ప్రయత్నం చేయాలని ఈ చిన్న కవితలో ఎంతో అందంగా చెప్పారు ప్రభాకర్. జీవితం అనే మినీ కవితలో మనిషి ప్రకృతిని చూసి ఎంతో నేర్చుకోవలసినది ఉందంటారు. చిన్న విత్తనం నుంచి బయటకు వచ్చిన మొక్క, మానుగా మారి కొమ్మలు, రెమ్మలతో శాఖోపశాఖలుగా విస్తరిస్తుంది. ఆకాశం అంత ఎత్తును చూస్తుంది. అంతేకాదు,తాను సమాజానికి ఎంతో ఉపయోగపడుతుంది. ఆశ్రయించినవారికి నీడ ఇస్తుంది. సమాజంలో పుట్టిన వ్యక్తి కూడా స్వార్థ చింతన మానుకుని వ్యక్తిత్వాన్ని అభివృద్ధి చేసుకుని తనకు, తన కుటుంబానికే కాక సమాజానికి ఉపయోగపడాలి అనే సందేశాన్ని ఎంతో తేలికైన మాటలతో చక్కగా వివరించారు. జీవితంలో నిరాశావాదానికి చోటులేదంటారు. వృక్షం స్వయంకృషికి ప్రతీక అంటారు -జీవితం అనే ఈ మినీకవితలో. ఈ వృక్షం నువ్వు ఉపిపోసుకోడానికి వినియోగింపబడ్డది కాదు స్వయం కృషిని శాఖోపశాఖలుగా విస్తరింపజేసుకొమ్మని.

పాఠ్యాంశ్య నేపధ్యం ఆధునిక కాలంలో మనుషులంతా నగరాల్లో జీవించాలని కోరుకుంటునారు. మరోవైపు పల్లెల్లో ఉపాధి అవకాశాలు తగ్గడంతో బతుకుతెరువుకోసం నగరాలకు వలసలు పెరిగిపోయాయి. నగరంలోని అనుకూలాంశాలన్నింటిని వినియోగించుకోవాలనే కోరికతో మనుషులు నగరంలో ఉండడానికి తాపత్రయపదుతున్నారు. దీనితో అనేక నగరాలు అత్యధిక జనాభాతో కిక్కిరిసిపోతున్నాయి. చాలా సమస్యలు పెరిగిపోయాయి. ప్రపంచీకరణ ప్రభావంతో నగరం శరవేగంగా తన రూపం మార్చుకుంతున్నది. సామాన్యుడికి అందనంత దూరంగా కది లి పోతున్నది నగరం . మధ్యతరగతికి అంతుచిక్కని ప్రాంతంగా మారిపోయింది నగరం. మనిషి యాంత్రిక స్ధితిలోకి మారిపోతున్నాడు మన కళ్ళ ముందు నిలుపుతూ, నగరపు మరో పార్శ్వాన్ని చూపుతూ, వాస్తవాల్ని కఠినంగా నిర్వచించిన విధాన్ని తెలియజెప్పడం ఈ పాఠం ఉద్దేశం.

పాఠ్యభాగ వివరాలు ఈ పాఠం "మినీ కవిత" అనే ప్రక్రియకు చెందినది. ఏదైనా ఒక అంశాన్ని కొసమెరుపుతోనో, చురకతోనో తక్కువ పంక్తుల్లో చెప్పడమే మినీ కవిత. ’అలిశెట్టి ప్రభాకర్ కవిత’ అనే గ్రంధంలోని ’సిటీలైఫ్’ మినీ కవితలలో కొన్నిటిని ’నగరగీతం’ గా కూర్చదమైంది.

దృష్టిని బట్టిసృష్టి గోచరిస్తుంది కొ o దరిని కొన్ని సన్నివేశాలు విశేషంగా ఆకర్షిస్తాయి. సదృదయుడు ప్రతి కదలిక నుంచీ ప్రేరణ పొందుతాడు. అతనికి భాష ఆయుధమైతే, భావం కవితారూపం సంతరించుకుంటుంది. నగరంలోని మూలలను, మూలాలానూ ఓ కవి హృదయం ఎట్లా దర్మించిందీ - ’అలిశెట్టి’ మిణీ కవిత(లు) మన కళ్ళకు గడుతుంది. మనకు కిటికీ తెరిచి చూస్తే అక్షరాల వెనుక అనంత దృశ్యాలు కనిపిస్తాయి... ప్రవేశిక

పద్యాలు

నగారా మోగిందా నయాగరా దుమికిందా నాలుగురోడ్ల కూడలిలో ఏమది? అదే, నగరారణ్యహోరు నరుడి జీవనఘోష

తల్లి ఒడివంతి పల్లెసీమల్నొదిల్లి తరలివచ్చిన పేదరైతులూ ఇనప్పెట్టెల్లాంటి ఈ ఫట్టణాల్లో ఊపిరాడని మీ బతుకులూ

నగరంలో ప్రతిమనిషి పఠినీయ గ్రంధమే మరి నీ బతుకు పేజీలు తిరిగేసేదెవరో ! G.JAISAIDEEP

ఉదయమే బస్సుల్లో రిక్షాల్లో పేవ్ మెంట్లపై విరబూసిన కాన్వెంటు పువ్వుల సందడి రాలే చదువుల పుప్పొడి !

సిటీ ఆంటే అన్నీ బ్యూటీ బిల్దింగ్ కావు అటు భవంతులూ ఇటు పూరిళ్ళూ దారిద్ర్యం, సౌభాగ్యం సమానంతర రేఖలు !

ఇది వెరైటీ సమస్యల మనుష్యుల సమ్మేళన కోలాహలం! ఎంతచేసినా ఎవరికీ తీరిక దక్కదు కోరిక చిక్కదు

మెర్కూరీ నవ్వలు, పాదరసం నదకలు కొందరికి రెండు కాళ్ళు రిక్షావాళ్ళకి మూడుకాళ్ళు ఉన్నవాళ్ళకి నాలుగుక్కాళ్ళు!

నగరంలో అన్నిపక్కలా సారించాలి మన చూపులు మహానగరాల రోడ్లకి మరణం నాలుగువైపులు!

నగరం మహావృక్షంమీద ఎఅవరికి వారే ఏకాకి! నగరం అర్థఓకాని రసాయనశాల నగరం చిక్కువీడని పద్మవ్యూహం!!

భావాలు

అనేక వాహనాల శబ్దాలు, మనుషుల మాటలు, చిరువ్యాపారుల అరుపులుతో నగరంలోని నాలుగు రోడ్ల కూడలితో వినిపించే రణగొణ ద్వ నులు గూండెలదిరిపోయేలా మేగిస్తున్న ధ్వనిలా, నగరజీవి బతుకుపోరాటంలోంచి వచ్చిన ఉఱుమూలాంటి శబ్దంలా ఉన్నాయని కవి వర్ణిస్తున్నాడు. అమ్మఒడిలాంటి పుట్టినఊరిని వదిలి ఉపాధికోసం నగరం తరలివచ్చిన ఇంత పెద్దపట్నంలో తలదాచుకోవడానికి కాస్త o త స్థలం కూడా దొరకదు. పేదరైతులు ఇనప్పెట్టెల్లాంటి ఇరుకిరుకు మురికి ప్రదేశంలో ఊపిరాడని స్థితిని అనుభవిస్తూ బతుకుతుంటారు. నగరంలో ప్రతిమనిషీ చదవవలసిన ఒక పుస్తకం లాంటివాడు. అయితే అతని బతుకు పుస్తకంలోని పేజీలను చదివేవారే ఉండరు. నగరంలోని మనిషివెనక అనేక ఆసక్తికరమైన ఆనంద, విషాదగాధ లుంటాయి. ఒక్కరైనా అతని బాగోగులు పట్టించుకునేవారే ఉండరనే చేదునిజాన్ని చెపుతున్నాడు కవి.

నగరంలో ఉదయాన్నే సిటీబస్సుల్లో, ఆటోల్లో, పేవ్ మెంట్లపై విరబూసిన పువ్వుల్లాంటి స్కూల్పిల్లలు సందడిచేశ్తుంటారు. వారి మాటల్లోంచి చదువుల పుప్పొడి రాలుతుంది. నగరం నిండా అన్నివైపులా అందమైన ఎత్తైన భవనాలు ఉంటాయనుకోవద్దు. ఒకవైపు ఖరీదైన భవంతుల పక్కనే చిన్న చిన్న పూరిపాకలూ ఉంటాయి. ఇక్కడ ఐశ్వర్యం , ఆదరిద్ర్యం పక్కపక్కనే సమాంతర రేఖగా కనిపిస్తాయి. నగరం వైవిధ్యమైన సమస్యలతో, విభిన్నమనస్తత్వాలతో కలిసిపోయి కలకలంతో నిండి ఉంటుంది. ఎంత నిరంతరాయంగా పనిచేసినా నగరంలోనిమనిషికి విశ్రాంతి తీసుకోవడానికి అనువైన సమయం దొరకదు. సంపాదించిన ధనంతో వెళ్ళేవారు ఆటీరిక్షాల్లో తిరిగివాళ్ళు, కార్లలో ప్రయాణించే ధనవంతులూ ఉంటారు .

నగరంలో నిరంతరం అప్రమత్తంగా ఉండాలి. అక్కడ అన్నివైపులా ప్రమాదాలు పొంచి ఉంటాయి, నాలుగుదిక్కుల్లోని రోడ్లలో మృత్యువు పొంచి ఉంటుందని కవి హెచ్చరిస్తున్నాడు. వృక్షాలమీద ఉండే పక్షులు పరస్పరం కలిసిపోయి ఉంటాయి. నగరమనే మహావృక్షం మీద నివసించే ఈ మనుషులు సాటిమనిషితో ఎటువంటి ఆత్మీయమైన పలకరింపులు లేకుండా ఇరుగూపోరుగనే భావన కూడ లేకుండా ఎవరికి వారే ఏకాకిగా బతుకుతుంటారు. ఈ యాంత్రిక మానసికస్ధితిని నిరసిస్తున్నాడు కవి.

ప్రయోగశాలలో ఎవేవో రసాయన ద్రవాలు, ఆమ్లాలు ఉంటాయి. వాటి చర్యలు అర్థం కావు. నగరం అంతకంటే అర్థంకాని రసాయనశాలలా ఉంటుంది. నగరంలో బతుకుదామని వచ్చినవారు, ఉపాధి దొరకకపోయినా ఏ దో ఒకరోజు దొరుకుతుం ఆశగా వేచిచూ స్తూం టారు . ఇక్కడి సౌకర్యాలు, విలాసాలు, వినోదాలు పైపై మెరుగులు బలంగా ఆకర్షిస్తాయి. మరోవైపు నిరుద్యోగం, జీవనవ్యయం భయపెడుతున్నా నగరం విడిచి ప్రశాంతంగా మన పల్లెలకు వెళ్ళనివ్వని, చిక్కుముడి విడదీయలేని పద్మవ్యూహం లాంటిది నగరం.

నగరాలోని శబ్దాలు మానావాలికి ప్రమాదం.....

తల్లి లాంటి గ్రామాలను వదిలి, నగరాలకు ప్రయానం.....

నగరాలలో కేవలం పెద్ద పెద్ద భవనాలే కాదు, వాటి పక్కనే చిన్న చిన్న పూరి గుడిసెలు కూడా ఉంటాయి …..

గ్రామం నుండి వచ్చిన ప్రజలకు నగరాలలో ఇళ్ళులు ఇవి.......

నగరాలలో అన్ని ప్రక్కలా ప్రమాదాలే....

గ్రామం నగరం

గ్రామం నగరం

చేయించిన వారు : పి.యస్.ఆర్.కె.శర్మ (సార్) టి.జి.టి . తెలుగు జ. న. వి. లేపాక్షి చేసిన వారు : జి.జై సాయి దీప్ 10 తరగతి - ఎ-వర్గం క్రమ సంఖ్య:22 జ. న. వి. లేపాక్షి

శుభం