The Faithful Witness Telugu.pptx

FredGosnell 181 views 11 slides Dec 09, 2023
Slide 1
Slide 1 of 11
Slide 1
1
Slide 2
2
Slide 3
3
Slide 4
4
Slide 5
5
Slide 6
6
Slide 7
7
Slide 8
8
Slide 9
9
Slide 10
10
Slide 11
11

About This Presentation

This is a Telugu translation of the English version of The Faithful Witness. Translated by Manohar Babu P


Slide Content

నమ్మకమైన సాక్షి. పేజీ - 1 * కీర్తనలు 89:35-37 అతని సంతానము శాశ్వతముగా ఉండుననియు, అతని సింహాసనము సూర్యుడున్నంతకాలము నా సన్నిధిని ఉండుననియు, చంద్రుడున్నంతకాలము అది నిలుచుననియు, మింటనుండు సాక్షి నమ్మకముగా ఉన్నట్లు అది స్థిరపరచబడుననియు, నా పరిశుద్ధతతోడని నేను ప్రమాణము చేసితిని, దావీదుతో నేను అబద్దమాడను. * సామెతలు 14:5 నమ్మకమైన సాక్షి అబద్ధమాడడు, కూటసాక్షికి అబద్ధములు ప్రియములు.

నమ్మకమైన సాక్షి. పేజీ - 2 * యిర్మియా 42:5 అప్పుడు వారు యిర్మియాతో ఇట్లనిరి - నిన్ను మా యొద్దకు పంపి, నీ దేవుడగు యెహోవా సెలవిచ్చిన ఆ మాటలనుబట్టి మరుమాట లేకుండ మేము జరిగించని యెడల యెహోవా మా మీద నమ్మకమైన సత్యసాక్షిగా ఉండును గాక. * ప్రకటన 1:5-6 నమ్మకమైన సాక్షియు, మృతులలో నుండి ఆది సంభూతుడుగా లేచిన వాడును, భూపతులకు అధిపతియునైన యేసుక్రీస్తు నుండియు, కృపాసమాధానములు మీకు కలుగును గాక. మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించినవానికి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగాక, ఆమేన్.

నమ్మకమైన సాక్షి. పేజీ - 3 * ఈ నిర్దిష్టమైన వాక్యభాగాల్లో "వానికి లేదా వాడు" అని పేర్కొన్న సందర్భంలో, అక్కడ యేసు అనే నిర్దిష్టమైన వ్యక్తిని సూచిస్తున్నది. * ఆయనలాంటి నమ్మకమైన సాక్షి లేడు. * మృతులలో నుండి ఆది సంభూతుడుగా లేచిన ఆయనలాంటివాడు లేడు. * భూపతులకు అధిపతియైన ఆయనలాంటి యువరాజు లేడు.

నమ్మకమైన సాక్షి. పేజీ - 4 * సాక్షి - ఒక సాక్షి. అనగా, దేని గురించైనా పూర్తి సమాచారం, లేదా జ్ఞానం కలిగి ఉండి, దాని గురించి సమాచారం ఇవ్వగలిగి, వెలుగులోకి తీసుకురాగలిగి, లేదా నిర్ధారించగలిగినవాడు. * నమ్మకత్వం - నమ్మదగిన; నమ్మకమైన. నమ్ముట, విశ్వాస పాత్రుడు, ఖచ్చితమైన వ్యక్తి.

నమ్మకమైన సాక్షి. పేజీ - 5 * యోహాను 1:1-3 ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవునియొద్ద ఉండెను, వాక్యము దేవుడై యుండెను. ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను. సమస్తమును ఆయన మూలముగా కలిగెను. కలిగియున్నదేదియు ఆయన లేకుండ కలుగలేదు. * యోహాను 1:14 ఆ వాక్యము శరీరధారియై, కృపాసత్యసంపూర్ణుడుగా మనమధ్య నివసించెను; తండ్రివలన కలిగిన అద్వితీయకుమారుని మహిమవలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. * మత్తయి 11:26-27 సమస్తమును నా తండ్రిచేత నా కప్పగింపబడి యున్నది. తండ్రిగాక యెవడును కుమారుని ఎరుగడు; కుమారుడు గాకను, కుమారు డెవనికి ఆయనను బయలుపరచ నుద్దేశించునో వాడు గాకను మరి ఎవడును తండ్రిని ఎరుగడు.

నమ్మకమైన సాక్షి. పేజీ - 6 * యోహాను 1:18 ఎవడును ఎప్పుడైను దేవుని చూడలేదు; తండ్రి రొమ్ముననున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచెను. * యోహాను 14:8-9 అప్పుడు ఫిలిప్పు - ప్రభువా, తండ్రిని మాకు కనబరచుము, మాకంతే చాలునని ఆయనతో చెప్పగా, యేసు - ఫిలిప్పూ, నేనింతకాలము మీ యొద్ద ఉండినను నీవు నన్ను ఎరుగవా? నన్ను చూచినవాడు తండ్రిని చూచియున్నాడు గనుక తండ్రిని మాకు కనుపరచుమని యేల చెప్పుచున్నావు? * యోహాను 5:19 కాబట్టి యేసు వారికి ఇట్లు ప్రత్యుత్తరమిచ్చెను- తండ్రి యేది చేయుట కుమారుడు చూచునో, అదే కాని తనంతట తాను ఏదియు చేయనేరడు; ఆయన వేటిని చేయునో, వాటినే కుమారుడును ఆలాగే చేయును.

నమ్మకమైన సాక్షి. పేజీ - 7 * యేసు దేవుడు. ఆదియందు ఆయన దేవుని యొద్ద ఉండెను మరియు సమస్తమును సృష్టించాడు. ఆయన శరీరధారియై తండ్రియైన దేవుని యొక్క ఏకైక అద్వితీయ కుమారునిగా మన మధ్య నివసించెను. * తండ్రి ఆయనకు సమస్తమును అప్పగించెను. * దేవుని చూచిన ఏకైక నరుడు యేసు మాత్రమే. * యేసును మరియు ఆయన చేసిన అద్భుతక్రియలను చూసినవారు, యేసు ప్రకారము, తండ్రిని చూశారు. * తండ్రి ఏది చేయుట చూచెనో, దానినే యేసు చేసెను. ఆయన చేసిన ప్రతీదీ తండ్రి వలన కలిగినది.

నమ్మకమైన సాక్షి. పేజీ - 8 * యోహాను 8:58 యేసు - అబ్రాహాము పుట్టకమునుపే నేను ఉన్నానని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాననెను. * యోహాను 8:24 కాగా మీ పాపములలోనేయుండి మీరు చనిపోవుదురని మీతో చెప్పితిని. నేను ఆయననని మీరు విశ్వసించని యెడల మీరు మీ పాపములోనేయుండి చనిపోవుదురని వారితో చెప్పెను. * నిర్గమకాండము 3:14 అందుకు దేవుడు - నేను ఉన్నవాడను అను వాడనైయున్నానని మోషేతో చెప్పెను. మరియు ఆయన - ఉండుననువాడు మీయొద్దకు నన్ను పంపెనని నీవు ఇశ్రాయేలీయులతో చెప్పవలెననెను. * పాత నిబంధనలో "నేను ఉన్నవాడను" అనబడిన దేవుడు యేసే. యేసు చెప్పిన ప్రతిదానికీ ఆయనే సాక్షియైయున్నాడు, మరియు మనము ఆయనను నమ్మవలెను.

నమ్మకమైన సాక్షి. పేజీ - 9 * యోహాను 5:21-23 a తండ్రి మృతులను ఏలాగు లేపి బ్రదికించునో ఆలాగే కుమారుడును తనకిష్టము వచ్చినవారిని బ్రదికించును. తండ్రి యెవనికిని తీర్పు తీర్చడు గాని.... తీర్పు తీర్చుటకు సర్వాధికారము కుమారునికి అప్పగించియున్నాడు. * యోహాను 5:36-37 అయితే యోహాను సాక్ష్యముకంటె నాకెక్కువైన సాక్ష్యము కలదు; అదేమనిన, నేను నెరవేర్చుటకై తండ్రి యే క్రియలను నా కిచ్చియున్నాడో, నేను చేయుచున్న ఆ క్రియలే తండ్రి నన్ను పంపియున్నాడని నన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నవి. మరియు నన్ను పంపిన తండ్రియే నన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నాడు; మీరు ఏ కాలమందైనను ఆయన స్వరము వినలేదు; ఆయన స్వరూపము చూడలేదు.

నమ్మకమైన సాక్షి. పేజీ - 10 * లూకా 19:10 నశించినదానిని వెదకి రక్షించుటకు మనుష్యకుమారుడు వచ్చెనని అతనితో చెప్పెను. * మత్తయి 1:21 ఆమె యొక కుమారుని కనును; తన ప్రజలను వారి పాపములనుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదువనెను. * లూకా 5:31-32 అందుకు యేసు - రోగులకే గాని ఆరోగ్యము గలవారికి వైద్యుడక్కరలేదు. మారుమనస్సు పొందుటకై నేను పాపులను పిలువవచ్చితిని గాని నీతిమంతులను పిలువరాలేదని వారితో చెప్పెను.

నమ్మకమైన సాక్షి. పేజీ - 11 * తండ్రి చనిపోయినవారిని లేపి, వారిని సజీవులనుగా చేయును. యేసు అదే చేశారు కాబట్టి, దేవుడే ఆయనను పంపాడనుటకును, మరియు తీర్పు తీర్చడానికి ఆయనకు అధికారమంతయు ఇవ్వబడినదనుటకు రుజువు. * ఏది ఏమైనప్పటికీ, ఆయన ఈ లోకానికి (శరీరధారిగా) వచ్చిన ఉద్దేశమేమిటంటే, తప్పిపోయిన వారిని వెదకి రక్షించడం. * దీనిని గూర్చి పాత నిబంధనలో ప్రవచింపబడినది, మరియు "యేసు" అను ఆయన పేరు యొక్క అర్థం ఆ ఉద్దేశాన్ని చెబుతున్నది. * మారుమనస్సు పొందుమని పాపులను పిలిచేందుకే తాను వచ్చానని యేసు చెప్పెను.