POLYMERS అనేక చిన్న చిన్న అణువులు ఒకదానితో ఒకటి చర్య నొంది అతి పెద్ద అణువును ఏర్పరిచే ప్రక్రియను పాలిమరీకరణం అంటారు. ఈ విధంగా ఏర్పడిన అతి పెద్ద అణువును బృహదణువు లేదా పాలిమర్ అంటారు.
కృత్రిమంగా తయోరైన నైలాన్ తాళ్లు, టైర్లు, ఎలక్ట్రికల్ స్విచ్‌లు, టెఫ్లాన్, ఆటబొమ్మలు, చెప్పులు, ప్లాస్టిక్ బకెట్లు, పాలిథిన్ సంచులు, పెయింట్స్, ప్రకృతిలో దొరికే స్టార్చి, సెల్యులోజ్, తోళ్లు, ఉన్ని, పట్టు... ఇవన్నీ పాలిమర్లతో తయారైనవే! గ్రీకు భాషలో పాలీ అంటే ''అనేక అని, ''మర్ అంటే భాగం అనీ అర్థం. అనేక ప్రాథమిక చిన్న యూనిట్లు ( మోనోమర్‌లు) కలిపి ఏర్పరిచే పెద్ద అణువునే ''పాలిమర్ (అధిక పరమాణు ద్రవ్యరాశి ఉండేది) అంటారు. పాలిమర్‌ను ఏర్పరిచే ప్రక్రియనే ''పొలిమరీకరణం అంటారు. పాలిమర్లను అనేక రకాలుగా వర్గీకరించారు. బృహదణువులు / పాలిమర్ లు
అనేక చిన్న చిన్న అణువులు ఒకదానితో ఒకటి చర్య నొంది అతి పెద్ద అణువును ఏర్పరిచే చర్యను పాలిమరీకరణం అంటారు. ఈ విధంగా ఏర్పడిన అతి పెద్ద అణువును బృహదణువు లేదా పాలిమర్ అంటారు. మోనోమర్ :- పాలిమర్ ఏర్ప్పడుటకు అవసరం అయ్యే చిన్న అణువు లేదా తక్కువ అణుభారం గల చిన్న భాగాన్ని మోనోమర్ అంటారు. ఉదా : పాలి ఎథిలిను యొక్క మోనోమర్ ఇథిలీను. డైమర్ : రెండు మోనోమర్ యూనిట్లు ఒకదానితో ఒకటి కలిసిపోయి డైమర్ ను ఇచ్చును. ట్రైమర్ : డైమర్ , మోనోమర్ లు కలిసి ట్రైమర్ ను ఏర్పరచును. వర్గీకరణ : లభించే మూలాల ఆధారంగా 1. సహజ పాలిమర్లు 2. సంశ్లేషిత పాలిమర్లు 3. అర్థ సంశ్లేషిత పాలిమర్లు
పాలిమర్లను అనేక విధాలుగా వర్గీకరిస్తారు . పాలిమర్లలోని మోనోమర్ యూనిట్లు కలిసివున్న తీరునుబట్టి . రేఖీయ పాలిమర్లు : మోనోమర్ యూనిట్లన్నీ ఒక దానితో ఒకటి కలిసి పొడవైన శృంఖలాలుగా ఉంటే వాటిని రేఖీయ పాలిమర్లు అంటారు . వీటిలో అణువులు ఒకదానితో ఒకటి సన్నిహితంగా బంధితమై ఉంటాయి . అందువలన వీటికి అధిక సాంధ్రత , బాష్పీభవన , ద్రవీభవన స్థానాలుంటాయి . ఉదా : పాలిథిన్ , నైలాన్ , పాలిఎస్టర్ శాఖీయ పాలిమర్లు : మోనోమర్ శృంఖలాల్లో శాఖలుంటే వాటిని శాఖీయ పాలిమర్లు (Branched polymers) అంటారు . ఇవి రేఖీయ పాలిమర్లంత సన్నిహితంగా బంధితమై ఉండలేవు . కాబట్టి వీటి సాంధ్రత , ద్రవీభవన , బాష్పీభవన స్థానాలు తక్కువగా ఉంటాయి . ఉదా : అమైలో పెక్టిన్ , స్టార్చ్ , గ్లైకోజెన్ క్రాస్ లింక్ డ్ పాలిమర్లు : మోనోమర్లు త్రిమితీయంగా , పటిష్టమైన జాలక నిర్మాణాన్ని ఏర్పరిస్తే వాటిని క్రాస్ లింక్ డ్ పాలిమర్లు (Cross-linked polymers) అంటారు . ఇవి పెళుసుగా , ధృఢ స్వభావంతో ఉంటాయి . ఉదా : బేకలైట్ , మెలమైన్
పాలిమర్లు తయారయ్యే పద్ధతిని బట్టి . సంకలన పాలిమర్లు : చర్యలో ఎలాంటి ఉప ఉత్పన్నాలను ఏర్పరచకుండా మోనోమర్లు పునరావృతమవుతూ ఏర్పడే పాలిమర్లను సంకలన పాలిమర్లు అంటారు . ఉదా : ఇథిలీన్ నుండి పాలిథిన్ ; స్టైరీన్ నుండి పాలిస్టైరీన్ సంఘ న న పాలిమర్లు : నీరు , అమ్మోనియా , ఆల్కహాల్ లాంటి ఉప ఉత్పన్నాలను ఏర్పరుస్తూ , మోనోమర్లు కలిసి పాలిమర్ ఏర్పడితే దాన్ని సంఘనన పాలిమర్లు అంటారు .
పాలిమర్ అణువుల మధ్య ఉండే బంధణాల దృఢత్వాన్ని బట్టి పాలిమర్ అణువుల మధ్య వుండే వాండర్ వాల్ ఆకర్షణలు , హైడ్రోజన్ బంధాలు వాటి ధృఢత్వానికి , స్థితిస్థాపకతకు కారణమవుతాయి . ఈ బలాల పరిమాణాన్ని బట్టి పాలిమర్లను ఎలాస్టోమర్లు , ఫైబర్లు , థర్మోప్లాస్టిక్స్ , థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్స్ గా వర్గీకరించారు . ఎలాస్టోమర్లు : పాలిమర్ అణువుల మధ్య బలాలు చాలా బలహీనంగా ఉండడం వలన వాటిపై కొద్దిపాటి ఒత్తిడి కలిగించినా గాని అవి సాగిపోతాయి . ఒత్తిడిని తొలగించగానే యధారూపానికి వస్తాయి . సహజ రబ్బర్ ఇందుకు ఒక ఉదాహరణ . ఫైబర్లు : పాలిమర్ అణువుల మధ్య హైడ్రోజన్ బంధాలున్నట్లయితే అవి ఫైబర్ల రూపంలో ఉంటాయి . నైలాన్ 6, 6 టెర్లిన్ , పాలీఎక్రైలోనైట్రేల్ వంటివి ఈ కోవకు చెందుతాయి . థర్మోప్లాస్టిక్కులు : ఇవి వేడి చేసినపుడు మృదువుగా అయ్యి తరువాత యధాస్థితికి వస్తాయి . ఇవి పొడవైన రేఖీయ పాలిమర్లు . సంకలన పాలిమరైజేషన్ ఫలితంగా ఏర్పడతాయి . వీటిలో పెళుసుదనం తక్కువ . థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్కులు : ఇవి వేడి చేసినపుడు మృదువుగా మారవు ( మెత్తబడవు ). ఒకవేళ బాగా వేడిచేసినపుడు ద్రవస్థితికి వస్తాయి గాని మళ్ళీ చల్లారినపుడు యధాస్థితికి రావు . ఇవి క్రాస్ లింకింగ్‌తో ఉండే పాలిమర్లు . దృఢంగా , పెళుసుగా ఉంటాయి .