Prahlada's prayers to Lord Narasimha.pptx

RamanaKumarSV1 0 views 45 slides Sep 09, 2025
Slide 1
Slide 1 of 45
Slide 1
1
Slide 2
2
Slide 3
3
Slide 4
4
Slide 5
5
Slide 6
6
Slide 7
7
Slide 8
8
Slide 9
9
Slide 10
10
Slide 11
11
Slide 12
12
Slide 13
13
Slide 14
14
Slide 15
15
Slide 16
16
Slide 17
17
Slide 18
18
Slide 19
19
Slide 20
20
Slide 21
21
Slide 22
22
Slide 23
23
Slide 24
24
Slide 25
25
Slide 26
26
Slide 27
27
Slide 28
28
Slide 29
29
Slide 30
30
Slide 31
31
Slide 32
32
Slide 33
33
Slide 34
34
Slide 35
35
Slide 36
36
Slide 37
37
Slide 38
38
Slide 39
39
Slide 40
40
Slide 41
41
Slide 42
42
Slide 43
43
Slide 44
44
Slide 45
45

About This Presentation

Prahlada's prayers to Lord Narasimha


Slide Content

8 శ్రీప్రహ్లాద ఉవాచ బ్రహ్మాదయః సురగణా మునయోరథ సిద్ధాః సత్వైకతానగతయో వచసాం ప్రవాహైః | నారాధితుం పురుగుణైరధునాపి పిప్రుః కిం తోష్టుమర్హతి స మే హరిరుగ్రజాతేః || భక్తప్రహ్లాదుడు స్తుతించెను అసురకులమున పుట్టిన నాకు భగవంతుని ప్రసన్నుని జేయుటకు తగిన స్తోత్రమును కావించుట ఎట్లు సాధ్యపడగలదు? సత్త్వగుణయుతులగు బ్రహ్మాది దేవతలు, ఋషులు పరమయోగ్యులయ్యును తమ విశిష్టమగు వాక్త్రవాహముతో ఇంతవరకును ఆతనిని ప్రసన్నుని చేయజాలకుండిరి. ఇక నా గురించి వేరుగా చెప్పునదేమున్నది? దానికి నేనెంత మాత్రము యోగ్యుడను కాను.

9 మన్యే ధనాభిజనరూపతపఃశ్రుతౌజ- స్తేజఃప్రభావబలపౌరుషబుద్ధి యోగాః | నారాధనాయ హి భవన్తి పరస్య పుంసో భక్త్యా తుతోష భగవాన్ గజయూథపాయ || ప్రహ్లాదుడు పలికెను : మనుజుడు ధనము, ఉన్నతజన్మము, సౌందర్యము, తపస్సు, విద్య, ఇంద్రియపటుత్వము, తేజస్సు, ప్రభావము, శారీరిక బలము, పౌరుషము, బుద్ధి, యోగశక్తి మున్నగువానిని కలిగియున్నను వానిచే భగవానుని ప్రసన్నుని చేయజాలకపోవునని నేను తలతును. కాని అతడు కేవలము భక్తియోగము చేత ఆ దేవదేవుని సంతుష్ఠుని చేయగలడు. గజేంద్రుడు అదే కావించినందున భగవానుడు అతని యెడ ప్రసన్నుడయ్యెను.

10 విప్రాద్ ద్విషడ్గుణయుతాదరవిందనాభ పాదారవి విముఖాత్ శ్వపచం వరిష్టమ్I మన్యే తదర్పితమనోవచనేహితార్థ ప్రాణం పునాతి స కులం న తు భూరిమానఃII బ్రాహ్మణుడు పండ్రెండు బ్రాహ్మణలక్షణములను (సనత్సుజాతమనెడి గ్రంథమున తెలుపబడినవి) కలిగియున్నను భగవచ్ఛరణారవిందముల యెడ విముఖుడైనచో (భక్తుడు కానిచో) మనస్సును, వాక్కును, కర్మలను, ధనప్రాణములను భగవంతునికే అర్పించినట్టి చండాలుని కన్నను హీనుడే అయియున్నాడు. అట్టి చండాలుడు తన వంశము నంతటిని పవిత్రము చేయగలవాడై నందున ఆ బ్రాహ్మణుని కన్నను శ్రేష్ఠుడై యున్నాడు. ఇక మిథ్యా గర్వితుడైన నామమాత్ర బ్రాహ్మణుడు తన నైనను పవిత్రుని కావించుకొనజాలడు.

11 నైవాత్మనః ప్రభురయం నిజలాభ పూర్లో మానం జనాదవిదుషః కరుణో వృణీతే | యద్యజ్జనో భగవతే విదధీత మానం తచ్చాత్మనే ప్రతిముఖస్య యథా ముఖశ్రీఃII భగవానుడు సదా ఆత్మసంతుష్టుడై యుండును కనుక ఏదేని ఆతనికి అర్పించినపుడు భగవదనుగ్రహముచే అది భక్తుని లాభముకొరకే అయి యుండును. ఏలయనగా ఆ దేవదేవునికి ఎవ్వరి సేవ అవసరము లేదు. ముఖమును అలంకరించుకొనినపుడు దర్పణమునందు ముఖప్రతిబింబము కూడా అలంకరింపబడినట్లు కనబడును.

12 తస్మాదహం విగతవి వ ఈశ్వరస్య సర్వాత్మనా మహి గృణామి యథా మనీషం | నీచోSజయా గుణవిసర్గమనుప్రవిష్ట పూయేత యేన హి పుమానను వర్ణితేన || కనుక అసురకులమున పుట్టినవాడనయ్యును నా బుద్ధి ననుసరించి నిస్సంకోచముగా పూర్ణయత్నముతో భగవంతుని స్తుతింతును. అవిద్య వలన సంసారమున బడినవాడు భగవన్మహిమలను కీర్తించినచో, వినినచో లౌకిక జీవనము నుండి పవిత్రుడు కాగలడు.

13 సర్వే హ్యమీ విధికరాస్తవ సత్త్వధామ్నో బ్రహ్మాదయో వయమివేశ న చోద్విజన్తః క్షేమాయ భూతయ ఉతాత్మసుఖాయ చాస్య విక్రీడితం భగవతో రుచిరావతారైః || దేవా! బ్రహ్మాదిదేవతలు దివ్యస్థితిలో నెలకొనినట్టి నీకు సేవకులై యున్నారు. కనుక వారు మా వంటి (నేను, నా తండ్రియైన హిరణ్యకశిపుడు) వారు కాదు. అత్యంత భీకరమగు ఈ రూపము నీ ఆనందము కొరకై స్వీకరింపబడిన లీలారూపమే. ఇట్టి అవతారములు సదా విశ్వరక్షణకు, విశ్వాభివృద్ధి కే ఉద్దేశింపబడియుండును.

14 యద్ యచ్ఛ మన్యుమసురశ్చ హతస్త్వయాద్య మోదేత సాధురపి వృశ్చికసర్పహత్యా | లోకాశ్చ నిర్వృతిమితాః ప్రతియన్తి సర్వే రూపం నృసింహ విభయాయ జనాః స్మరని || కనుక ఓ నృసింహదేవా! అసురుడైన నా తండ్రి హిరణ్యకశిపుడు ఇపుడు వధింపబడినందున దయచేసి క్రోధమును వీడుము. సాధుపురుషులు కూడా తేళ్ళు, పాములు చచ్చుటచే సంతోషించునట్లు ఈ దానవుని మరణముచే సర్వలోకములు గొప్ప సంతృప్తిని బడసినవి. జనులు ఇపుడు తమకు సుఖము కలుగగలదని పూర్తి విశ్వాసముతో ఉన్నారు; భయనివృత్తి కై వారిక ఎల్లప్పుడు నీ మంగళమయ రూపమునే స్మరింపగలరు.

15 నాహం బిభేమ్యజిత తే తిభయానకాస్య జిహ్వార్కనేతభ్రుకుటీరభసోగ్రదంత్ | ఆస్త్ర జఃక్షతజకేశరశంకుకర్ణాన్ నిర్ఘాదభీతదిగి భాదరిభిన్నభాగ్రాత్ || అజితుడా! నీ భయంకరమగు ముఖమునకు, నాలుకకు, సూర్యుని వంటి తేజము కలిగిన నీ నేత్రములకు, ముడివడిన కనుబొమలకు నిక్కముగా నేను భయపడుట లేదు. తీక్షణమగు నీ దంతములు, ప్రేవుల మాల, రక్తసిక్త మైన జూలు, కొయ్యముక్కల వంటి ఎత్తైన కర్ణములు, ఏనుగులను దూరముగా పరుగెత్తింపజేయు గర్జన, శత్రునాశకమగు నఖములు నాకు ఎంత మాత్రము భయమును కలిగించుట లేదు.

16 త్రస్తోకస్మ్యహం కృపణవత్సల దుస్సహోగ్ర సంసారచక్రకదనాద్గ్రసతాం ప్రణీతః | బద్ధః స్వకర్మభిరుశత్తమ తే మూలం ప్రీతో పవర్గశరణం హ్వయసే కదా ను || ఓ పరమశక్తిమంతుడా! దుర్జయుడా! కృపణవత్సలా! కర్మఫలము వలన నేను దానవుల సాంగత్యమున బడితిని. భౌతికజగత్తునందు సంప్రాప్త మైన ఈ స్థితియే నాకు మిగుల భీతిగొల్పుచున్నది. భవబంధమోక్షమునకు చరమ లక్ష్యమైన నీ పాదపద్మాశ్రయమును చేరుటకు నన్ను పిలిచెడి ఆ క్షణము ఎప్పుడు అరుదెంచగలదు?

17 యస్మా యాప్రియవియోగసంయోగజన్మ - శోకాగ్నినా సకలయోనిషు దహ్యమానః | దుఃఖైషధం తదపి దుఃఖమతద్ధియాహం భూమన్ భ్రమామి వద మే తవ దాస్యయోగమ్ || దేవదేవా! మహానుభావా! ప్రియములు, అప్రియములైన పరిస్థితుల సంయోగము వలనను, వాని నుండి వియోగము వలనను జీవుడు శోకాగ్ని తప్తమైన చందమున స్వర్గనరకాది లోకములలో అతిదయనీయమగు స్థితిలో ఉంచబడును. అట్టి దుఃఖమయజీవితము నుండి బయటపడుటకు పలు ఉపాయములున్నను ఈ భౌతికజగత్తునందు అవి మూలదుఃఖముల కన్నను అమిత దుఃఖకరములై యున్నవి. కనుక నీ సేవలో నెలకొనుట ఒక్కటే నిజమైన ఉపాయమని నేను తలంచుచున్నాను. దయచేసి అట్టి సేవను నాకు ఉపదేశించుము.

18 సోర్హం ప్రియస్య సుహృదః పరదేవతాయా లీలాకథాస్తవ నృసింహ విరించగీతాః | అంజస్తితర్మ్యనుగృణన్ గుణవిప్రముక్తో దుర్గాణి తే పదయుగాలయహంససఙ్గః | నృసింహదేవా! ముక్తాత్ములైన (హంసలు) భక్తుల సాంగత్యమున నీ దివ్య సేవలో నెలకొనినవాడనై త్రిగుణ సంపర్కమును పూర్తిగా విడనాడి పరమ ప్రియుడవైన నీ మహిమలను కీర్తింపజాలుదును. బ్రహ్మదేవుడు, అతని శిష్య పరంపరను అనుసరించుచు నీ మహిమలను కీర్తించి నిశ్చయముగా నేను అవిద్యాసాగరమును దాటగలను.

19 బాలస్య నేహ శరణం పితరౌ నృసింహ నార్తస్య చాగదముదన్వతి మజ్జతో నౌః | తప్తస్య తత్ప్రతివిధిర్య ఇహాంజ సేష్ట స్తావద్ విభో తనుభృతాం త్వదు పేక్షితానాం II ఓ నృసింహదేవా! స్వామీ! దేహాత్మబుద్ధి కలవారైనందున నీచే నిర్లక్ష్యపరుప బడిన దేహధారులు తమ బాగు కొరకు ఏదియును చేసికొనజాలరు. వారు చేపట్టెడి ఉపాయములు తత్కాలికముగా లాభదాయకములే అయినను నిక్కముగా అశాశ్వతములై యున్నవి. ఉదాహరణకు తల్లిదండ్రులు తమ సంతానమును రక్షించుకొనజాలరు; వైద్యుడు, ఔషధము రోగికి ఉపశమనము నివ్వజాలవు; సముద్రమందున్న నౌక మునిగిపోవువానిని రక్షింపజాలదు.

20 యస్మిన్ యతో యర్షి యేన చ యస్య యస్మా ద్యస్మై యథా యదుత యస్త్వపరః పరో వా | భావః కరోతి వికరోతి పృథక్స్వభావః సంచోదితస్తదఖిలం భవతః స్వరూపమ్ || దేవా! ఈ భౌతికజగత్తునందు ప్రతియొక్కరు సత్త్వరజస్తమోగుణ ప్రభావితులే అయియున్నారు. మహనీయుడగు బ్రహ్మ మొదలుకొని చీమ వరకు ప్రతియొక్కరు ఆ గుణప్రభావముననే పనిచేయుదురు. కనుక ఎల్లరును నీ శక్తిచే ప్రభావితులైనవారే. ఏ కారణమున వారు పనిచేయుచున్నారో, ఎచ్చట పనిచేయు చున్నారో, ఏ సమయమున పనిచేయుచున్నారో, ఏ జీవితలక్ష్యమును చరమమని భావించి పనిచేయుచున్నారో, ఆ లక్ష్యసాధన విధానములన్నియును నీ స్వరూపమే. శక్తి, శక్తిమంతుడు ఒకడే కనుక నిజమునకు అదియంతయు నీ స్వరూపమే అయియున్నది.

21 మాయా మనః సృజతి కర్మమయం బలీయః కాలేన చోదితగుణానుమతేన పుంసః | ఛందోమయం యదజయార్పితపోడసారం సంసారచక్రమజ కోకతితరేత్ త్వదన్యః || దేవా! పరమనిత్యుడా! ప్రధానాంశ విస్తారముచే నీవు కాలచోదితమగుమాయ ద్వారా జీవుల సూక్ష్మశరీరములను సృష్టించితివి. ఆ విధముగా మనస్సు కర్మకాండ వలనను, పదునారు తత్త్వముల వలనను తీరెడ్డి అనంతమగు కోరికలతో జీవుని బంధించినది. నీ పాదపద్మములను ఆశ్రయింపనిదే ఎవ్వడు ఆ బంధనము నుండి బయటపడగలడు?

22 స త్వం హి నిత్యవిజితాత్మగుణః స్వధామ్నా కాలో వశీకృతవిసృజ్యవిసర్గశక్తిః | చక్రే విసృష్టమజయేశ్వర షోడశారే నిష్పీడ్యమానముపకర్ష విభో ప్రపన్నమ్ II దేవా! విభో! పదునారు తత్త్వములను గూడిన ఈ భౌతికజగత్తును సృష్టించినను వాటి భౌతికలక్షణములకు నీవు పరుడవై యున్నావు. అనగా అవి నీ ఆధీనమునందే ఉన్నవి, నీవెన్నడును వానిచే జయింపబడవు. కనుక నీవే కాలస్వరూపుడవు. ఓ పరమేశ్వరా! నిన్నెవ్వరును జయింపజాలరు. కాని నేను మాత్రము కాలచక్రముచే నలిగి పిప్పియగుచున్నాను. కనుక నిన్నే నేను పూర్తిగా ఆశ్రయించెదను. కరుణతో ఇపుడు నీ పాదపద్మాశ్రయమున చేర్చుకొనుము.

23 దృష్ణా మయా దివి విభో ఖిలధిష్ఠ్యపానా- మాయుః శ్రియో విభవ ఇచ్ఛతి యంజనో యమ్ | యే స్మత్పితుః కుపితహాసవిజృంభితభ్రూ విస్ఫూర్జితేన లులితాః స తు తే నిరస్తః || దేవా! దీర్ఘాయువు, ఐశ్వర్యము, భోగముల కొరకు జనులు ఉన్నత లోకములను చేరగోరుదురు. కాని నా తండ్రి కలాపముల ద్వారా వానిని గూర్చి నేను పూర్తిగా నెరిగియున్నాను. నా తండ్రి కుపితుడై వ్యంగ్యహాసము చేసినపుడు అతని భ్రుకుటి కదలికలకే దేవతలందరు వినష్టులైరి. అంతటి శక్తిమంతుడైనను నా తండ్రి ఇపుడు నీచే క్షణములో నశించినాడు.

24 తస్మాదమూస్తనుభృతామహమాశిపోజ్ఞ ఆయుః శ్రియం విభవమైయమావిరించ్యాత్ | నేచ్ఛామి తే విలులితానురువిక్రమేణ కాలాత్మనోపనయ మాం నిజభృత్యపార్శ్వమ్ || దేవా! బ్రహ్మ మొదలుకొని చీమ వరకు గల సకలజీవులు అనుభవించెడి భౌతికైశ్వర్యము, సిద్ధులు, దీర్ఘాయువు, ఇతర భౌతికసౌఖ్యములను గూర్చి నాకిపుడు పూర్తి అనుభవము కలిగినది. కాలరూపమున నీవు వాటన్నింటిని నశింపకేయుదువు. నాకు కలిగిన ఈ అనుభవము వలన వానిని నేను పొందగోరను. భగవంతా! నన్ను నీ విశుద్ధభక్తుని సాంగత్యమున జేర్చి దాసునిగా ఆయనను సేవించులాగున అనుగ్రహింపుమనియే నేను అర్థింతును.

25 కుత్రాశిషః శ్రుతిసుఖా మృగతృష్టి రూపా క్వేదం కలేవరమశేషరుజాం విరోహః || నిర్విద్యతే న తు జనో యదపీతి విద్వాన్ కామానలం మధులవైః శమయన్దురా పైః ఈ భౌతికజగత్తు నందు ప్రతిజీవుడు ఎడారి యందలి ఎండమావుల వంటి భవిష్యత్ సుఖమునే కోరుకొనును. కాని ఎడారిలో జలమెక్కడున్నది ? అనగా ఈ భౌతికజగత్తులో సుఖమెక్కడున్నది ? ఈ దేహమునకు సంబంధించినంతవరకు దాని విలువేమిటి ? అది కేవలము పలురోగకారణమే అయియున్నది. నామమాత్ర తత్త్వవేత్తలు, శాస్త్రజ్ఞులు, రాజనీతిజ్ఞులు ఈ విషయమును చక్కగా నెరిగినను అట్టి తాత్కాలికమగు సుఖమునే అభిలషింతురు. సుఖము దుర్లభ మేయైనను ఇంద్రియనిగ్రహము లేని కారణమున వారు భౌతికజగత్తులోని నామమాత్ర సుఖము వెంట పరుగుదీయుచు ఎన్నడును సరియైన నిర్ణయమునకు రాకుందురు.

26 క్వాహం రజఃప్రభవ ఈశ తమోధి కేకస్మిన్ జాతః సురేతరకులే క్వ తవానుకంపా| న బ్రహ్మణో న తు భవస్య న వై రమాయా యన్మేకర్పితః శిరసి పద్మకరః ప్రసాదః || దేవదేవా! నారకీయమగు రజస్తమోగుణభరితమైన అసురకులమున బుట్టి నందున నా స్థానమెక్కడ? బ్రహ్మరుద్రాదులకు, లక్ష్మీదేవికి కూడా దుర్లభ మైన నీ నిర్ణేతుక కరుణ ఎక్కడ? వారి శిరముల పై ఏనాడును కరకమలము నుంచని నీవు దానినిపుడు నా శిరమున ఉంచితివి.

27 నైషా పరావరమతిర్భవతో నను స్యా జ్జన్తోర్యథాత్మసుహృదో జగతస్తథాపి | సం సేవయా సురతరోరివ తే ప్రసాదః సేవానురూపముదయో న పరావరత్వమ్ || స్వామీ! సాధారణజీవుని వలె గాక నీవు శత్రుమిత్రులకు, అనుకూల ప్రతికూలురకు భేదమును చూపవు. ఉచ్చనీచమను భావమే నీ యందు లేదు.అయినను కోరిక ననుసరించి ఫలము నిచ్చుచు ఉచ్చనీచభేదము చూపని కల్పవృక్షము వలె నీవు మనుజుడొనర్చిన సేవ ననుసరించి వరముల నిత్తువు.

28 ఏవం జనం నిపతితం ప్రభవాహికూపే కామాభికామమును యః ప్రపతత్ప్రసంగాత్ | కృత్వాత్మసాత్ సురర్షిణా భగవన్ గృహీతః సో5 హం కథం ను విసృజే తవ భృత్య సేవామ్ || దేవా! ఒక్కొక్కటిగా విషయవాంఛలతో సాంగత్యమువలన జనసామాన్యము ననుసరించుచు నేను సర్పములతో నిండిన అంధకూపమున క్రమముగా పడుతున్న సమయమున నీ నిత్యదాసుడగు నారదముని నన్ను శిష్యునిగా స్వీకరించి దివ్యస్థితిని బడయుటెట్లో ఉపదేశించెను. కనుక అతనిని సేవించుటయే నా ప్రథమకర్తవ్యము. ఆ మహానుభావుని సేవను నేనెట్లు విడువగలను?

29 మత్య్రాణరక్షణమనన్త పితుర్వధశ్చ మన్యే స్వభృత్యఋషివాక్యమృతం విధాతుమ్ | ఖడ్గం ప్రగృహ్య యదవోచద సద్విధిత్సు స్వామీశ్వరో మదపర్వతు కం హరామి || హే ప్రభూ! అనంత దివ్యగుణనిధీ! నీవు నా తండ్రి యగు హిరణ్యకశిపుని వధించి అతని ఖడ్గము నుండి నన్ను కాపాడితివి. "నేను గాక వేరొక పరమ నియామకుడున్నచో వాడు నిన్ను రక్షించుగాక! నేనిప్పుడే నీ శిరమును ఖండించి వేయుదును" అని అతడు క్రోధముతో పలికియుండెను. కనుక నీ భక్తుని వాక్కులను నిజము చేయుటకే నన్ను రక్షించుట, దానవుని దునుమాడుట యను కార్యములను జేసితివని నేను తలంచుచున్నాను. దానికి వేరొక్క కారణము లేదు.

30 ఏకస్త్వమేవ జగదేతమముష్య యత్త్వ మాద్యన్తయోః పృథగపస్యసి మధ్యతశ్చ | సృష్ట్వా గుణవ్యతికరం నిజమాయయేదం నానేవ తైరవసితస్తదనుప్రవిష్టః ॥ దేవా! నీవు సృష్టికి పూర్వము ఉన్నావు, విలయానంతరము నిలిచి యుందువు, ఆద్యంత పర్యంతము సృష్టిని పోషించువాడవు నీవే. కనుక స్వయముగా నీవే ఈ జగద్రూపమున ప్రకటమై యున్నావు. త్రిగుణముల కార్యకారణముల ద్వారా నీ నిజమాయచే ఇదంతయు నిర్వహింపబడును. అందువలన అంతర్బాహ్యములలో ఉన్న సమస్తము కేవలము నీవే అయి యున్నావు.

31 త్వం వా ఇదం సదసదీశ భవాంస్తతోన్యో మాయా యదాత్మపరబుద్ధిరియం హ్యపార్థా | యద్యస్య జన్మ నిధనం స్థితిరీక్షణం చ తద్వై తదేవ వసుకాలవదష్టి తర్వోః || ప్రభూ! దేవదేవా! సమస్తసృష్టికి నీవే కారణము, ఈ జగత్తు నీ శక్తి యొక్క పరిణామమే అయియున్నది. సమస్త విశ్వము నీకు అన్యము కాకపోయినను నీవు దానికి పరముగా నుందువు. సమస్తము నీ నుండియే ఉద్భవించి నీకు అభిన్నమై యున్నందున నాది, నీది అనెడి భావన నిక్కముగా ఒకరకమైన మాయయే. నిజముగా ఈ జగత్తు నీకు అభిన్నమై యున్నది, దానిని లయింపజేయువాడవు కూడా నీవే. నీకు, ఈ జగత్తుకు గల సంబంధము బీజము వృక్షములతో (సూక్ష్మ కారణము, స్థూలకారణము) వివరింపనగును .

32 న్యస్యేదమాత్మని జగద్విలయాంబుమధ్యే శేషే5త్మనా నిజసుఖానుభవో నిరీహః | యోగేన మీలితదృగాత్మనిపీతనిద్ర స్తుర్యే స్థితో న తు తమో న గుణాంశ్చ యుజ్ క్షే || ప్రభూ! దేవదేవా! అర్ధనిమీలిత నేత్రములతో నిద్ర యందున్నవానిగా గోచరించు నీ యందే విలయానంతరము సృజనశక్తి నిలిచియుండును. కాని నిజమునకు నీవు సామాన్యమానవుని వలె నిదురించువాడవు కావు. నీవు ఈ భౌతికసృష్టికి పరముగా సదా దివ్యస్థితి యందుండువాడవు, దివ్యానందమును అనుభవించువాడవు అయియున్నావు. భౌతికమైనవానిచే అంటబడక ఆవిధముగా నీవు క్షీరోదకశాయి విష్ణువు రూపమున దివ్యస్థితిలో నిలిచియుందువు. నీవు నిదురించుచున్నట్లు గోచరించినను ఆ నిద్ర తమోమయ నిద్రకు భిన్నమైనది.

33 తస్యైవ తే వపురిదం నిజకాలశక్త్యా సంచోదితప్రకృతిధర్మణ ఆత్మగూఢమ్ | అమ్బస్యనన్త శయనాద్విరమత్సమాధే ర్నాభేరభూత్ స్వకణికావటవన్మహాబ్జమ్ ॥ ఈ విశ్వము (భౌతికజగత్తు) కూడా నీ శరీరమే. అది కాలశక్తిచే క్షుభితమై నపుడు ప్రకృతి త్రిగుణములు ప్రకటమగును. అపుడు శేషశయ్య నుండి నీవు నిద్ర లేచినంతట నీ నాభి నుండి చిన్న దివ్యబీజము ఉత్పన్నమగును. చిన్న బీజము నుండి మహావటవృక్షము పెరిగినట్లు, ఆ దివ్యబీజము నుండియే విరాట్ విశ్వకమలము ప్రకటమైనది.

34 తత్సమ్భవః కవిరతో 5న్యదపశ్యమాన స్త్వాం బీజమాత్మని తతం స బహిర్విచిస్త్య | నావిన్ద దబ్దశతమప్సు నిమజ్జమానో జాతే ఙ్కురే కథముహోపలభేత బీజమ్ || ఆ మహాకమలము నుండి బ్రహ్మోద్భవము జరిగెను, కాని కమలమును తప్ప వేరేదియును అతడు గాంచజాలకపోయెను. కనుక నీవు బయట ఉన్నావని తలచినవాడై అతడు జలములందు చేరి కమల మూలమును కనుగొనుటకు నూరు సంవత్సరములు యత్నించెను. అయినను అంకురము పుట్టినపుడు మూలబీజము కనబడనట్లుగా, నీ జాడను అతడు కనుగొనజాలకపోయెను.

35 స త్వాత్మయోనిరతివిస్మిత ఆశ్రితో బ్జం కాలేన తీవ్రతపసా పరిశుద్దభావః | త్వామాత్మనీశ భువి గన్ధ మివాతిసూక్ష్మం భూతేన్డ్రియాశయమయే వితతం దదర్శ || ఆత్మయోని యగు బ్రహ్మ అంతట విస్మితుడై కమలమును ఆశ్రయించెను. వందల కొలది సంవత్సరములు తీవ్రమగు తపము నాచరించి పవిత్రుడైనంతట అతడు అత్యంత సూక్ష్మ మైనను గంధము పృథ్వి యందు గోచరమగునట్లు, తన దేహేంద్రియములలో వ్యాప్తమై యున్నట్టి సర్వకారణకారణుడగు దేవదేవుని గాంచగలిగెను.

36 ఏవం సహస్రవదనాజ్ఞిశిరఃకరోరు నాసాద్యకర్ణనయనాభరణాయుధాఢ్యమ్ | మాయామయం సదుపలక్షిత సన్నివేశం దృష్ట్వా మహాపురుషమాప ముదం విరించః || బ్రహ్మదేవుడు అపుడు వేలకొలది ముఖములను, పాదములను, శిరములను, హస్తములను, ఊరువులను, నాసికలను, కర్ణములను, నయనములను కలిగిన వానిగా నిన్ను గాంచగలిగెను. వివిధాభరణములతోను, ఆయుధములతోను విరాజిల్లుచు నీవు చక్కని వస్త్రధారణము కావించియుంటివి. రూపలక్షణములు దివ్యముగా నుండి అధోలోకముల వరకు వ్యాపించియున్నట్టి పాదములు కలిగిన మహాపురుష రూపమున నిన్ను గాంచి అతడు పరమానందమును పొందెను

37 తస్మై భవాన్హయశిరస్తనువం హి బిభ్ర ద్వేదద్రుహావతిబలౌ మధుకైటభాఖ్యా | హత్వానయచ్ఛుతిగణాంశ్చ రజస్తమశ్చ సత్త్వం తవ ప్రియతమాం తనుమామనన్తి || దేవా! హయగ్రీవరూపమున అవతరించినపుడు నీవు రజస్తమోగుణ యుతులగు మధుకైటభులను దానవులను దునుమాడి వేదములను బ్రహ్మకు ఒసగితివి. ఈ కారణముననే మహర్షులు నీ రూపములు దివ్యములని, భౌతిక గుణములచే అంటబడనివని అంగీకరింతురు.

38 ఇత్థం నృతిర్యగృషిదేవఝషావతారై- ర్లోకాన్ విభావయసి హంసి జగత్ప్రతీపాన్ | ధర్మం మహాపురుష పాసి యుగానువృత్తం ఛన్నః కలౌ యదభవస్త్రియుగో౦థ సత్వమ్ || దేవా! ఈ ప్రకారము నీవు నరుడు, పశువు, ఋషి, దేవత, మత్స్యము, కూర్మము మున్నగు రూపములలో అవతరించి సమస్త లోకములను పోషించుచు దానవులను వధింతువు. స్వామీ! యుగము ననుసరించి నీవు ధర్మమును పరిరక్షింతువు. కాని కలియుగమున నీవు భగవంతుడనని చెప్పుకొనవు కనుక “త్రియుగ” (మూడు యుగములలో ప్రకటమగువాడు) అని తెలియబడుదువు.

39 నైతన్మనస్తవ కథాసు వికుంఠనాథ సంప్రీయతే దురితదుష్టమసాధు తీవ్రమ్ | కామాతురం హర్షశోకభ యైషణార్తం తస్మిన్ కథం తవ గతిం విమృషామి దీనః ॥ ఓ వైకుంఠనాథా! ఒకప్పుడు నామమాత్ర సుఖముతోను, మరొక్కప్పుడు దుఃఖముతోను నిండినదై నా మనస్సు పరమదుష్టము, కామాతురమునై యున్నది. శోకభయపూర్ణమై అది ఎల్లప్పుడు అధికాధికముగా ధనమును గోరుచుండును. ఆ విధముగా అది మిగుల దూషితమై నీ కథల పట్ల ప్రియము చెందకున్నది. అందువలన పరమపతితుడను, దీనుడనైన నేను ఇట్టి పరిస్థితిలో నీ దివ్యకర్మలనెట్లు చర్చింపగలను?

40 జిహ్వైకతో 5చ్యుత వికర్షతి మావితృప్తా శిశ్నో5న్యతస్త్వగుదరం శ్రవణం కుతశ్చిత్ | ఘ్రాణోన్యతశ్చ పలదృక్ క్వ చ కర్మశక్తి ర్బహ్వ్యః సపత్న్య ఇవ గేహపతిం లునన్తి ॥ దేవా! అచ్యుతా! భర్తను తమ వైపునకే ఆకర్షించుకొనుటకు యత్నించెడి పలువురు భార్యలను కలిగిన పురుషుని పరిస్థితి వలె నా స్థితి తయారైనది. నాలుక రుచికరమైన ఆహారపదార్థముల వైపునకు, శిశ్నము సుందరస్త్రీ సంభోగము వైపునకు, స్పర్శ మృదువైన వస్తువులను తాకుటకు

ఆకర్షితమగు చున్నవి. పూర్తిగా నిండినప్పటికిని ఉదరము ఇంకను తినగోరును, కర్ణములు నిన్ను గూర్చి విన యత్నింపక గ్రామ్యకథలకే ఆకర్షితమగుచుండును. నాసిక ఇంకొక ప్రక్కకు ఆకర్షితము కాగా, చంచలమగు నయనములు ఇంద్రియభోగ దృశ్యముల వైపునకు పరుగుతీయుచున్నవి; కర్మేంద్రియములు మరొక ప్రక్కకు ఆకర్షితమగుచున్నవి. ఈ ప్రకారము నేను నిక్కముగా కలవరము చెంది యున్నాను.

41 ఏవం స్వకర్మపతితం భవవైతరణ్యా మన్యోన్యజన్మమరణాశనభీతభీతమ్ | పశ్యన్ జనం స్వపరవిగ్రహవైరమైత్రం హస్తేతి పారచర పీపృహి మూఢమద్య ॥ దేవా! మృత్యునదీ ప్రవాహమునకు సదా ఆవలి వైపున నీవు దివ్యముగా నెలకొనియుందువు. ఇక కర్మఫలము వలన మేము ఈ వైపున కష్ట పరంపరలో ఉన్నాము. నిజమునకు మేము ఈ వైతరిణి యందు పడి నిరంతరము జన్మమృత్యు క్లేశముల ననుభవించుచు దారుణమైనవి భుజించుచున్నాము. కనుక నన్నే గాక దుఃఖార్తులైన ఎల్లరను దయతో వీక్షించి నీ నిర్హేతుకమగు కరుణతోను, అనుగ్రహముతోను ఉద్ధరించి పాలింపుము.

42 కో స్వత్రతే Sఖిలగురో భగవన్ ప్రయాస ఉత్తారణే౦స్య భవసంభవలోపహేతోః । మూథేషు వై మహదనుగ్రహ ఆర్తబన్ధ కిం తేన తే ప్రియజనానను సేవతాం నః || దేవదేవా! జగద్గురూ! విశ్వకలాపములనే నిర్వహించెడి నీకు నీ భక్తిలో నెలకొనిన పతితాత్ములను ఉద్దరించుటలో ప్రయాస ఏమున్నది? నీవు ఆర్తులకు మిత్రుడవై యున్నావు, ఇక మూర్ఖుల యెడనే మహాత్ములు తప్పక కరుణ జూపవలసియున్నది. కనుకనే నీ సేవలో నిలిచినట్టి మావంటి వారలపై నిర్హేతుకమగు కరుణను చూపెదవని నేను తలంచుచున్నాను.

43 నైవోద్విజే పర దురత్యయవైతరణ్యా స్త్వద్వీర్యగాయనమహామృతమగ్నచిత్తః శోచే తతో విముఖచేతన ఇన్డ్రియార్థ- మాయాసుఖాయ భరముద్వహతో విమూథాన్ || ఓ శ్రేష్ఠ పురుషా! నేనెచ్చట ఉన్నను నీ యశోకర్మల చింతనలోనే పూర్తిగా సంలగ్నమై యుందును కనుక భౌతిక అస్తిత్వమునకు భయపడుట లేదు. భౌతికసౌఖ్యము కొరకు మరియు తమ కుటుంబము, సంఘము, దేశము కొరకు విస్తృతమగు యోచనలను కావించెడి మూర్ఖులు, మూడులను గూర్చియే నేను చింతించుచున్నాను. కేవలము వారి కొరకే నేను దుఃఖించుచున్నాను.

44 ప్రాయేణ దేవ మునయః స్వవిముక్తికామా మౌనం చరన్తి విజనే న పరార్థనిష్ఠాః | నైతాన్ విహాయ కృపణాన్ విముముక్ష ఏకో నాన్యం త్వదస్య శరణం భ్రమతో నుపశ్యే || ఓ నృసింహదేవా! పలువురు సాధుపురుషులున్నను వారు కేవలము తమ ఉద్ధారము నందే అభిరుచిని కలిగియున్నట్లు నేను గాంచితిని. నగరములను, పట్టణములను పట్టించుకొనక వారు హిమాలయములకో, అరణ్యమునకో వెడలి మౌనవ్రతముతో ధ్యానమాచరింతురు. పరులను ఉద్దరించుటలో వారికి అభిరుచి లేదు. కాని నాకు సంబంధించినంతవరకు ఈ దీనులగు మూర్ఖులను, మూఢులను వదలి

నేనొక్కడనే ముక్తినొందగోరను. భక్తిభావనారహితముగా, నీ పాదపద్మాశ్రయము లేకుండ ఎవ్వడును సుఖవంతుడు కాజాలదని నేను ఎరుగుదును. కనుక వారందరిని నీ చరణకమలాశ్రయమునకు చేర్చవలెననియే నేను కోరుచున్నాను.

45 యన్మైథునాది గృహమేధిసుఖం హి తుచ్ఛం కండూయనేన కరయోరివ దుఃఖదుఃఖమ్ | తృప్యన్తి నేహ కృపణా బహుదుఃఖభాజః కండూతివన్మనసిజం విషహేత ధీరః || మైథున సుఖభోగమును దురదతీరుటకు రెండు చేతుల నుపయోగించి గోకుకొనుటతో పోల్చవచ్చును. గృహమేధులు (ఆధ్యాత్మికజ్ఞానము లేనట్టి నామమాత్ర గృహస్థులు) ఆ దురదనే మహోన్నతమగు సుఖపదమని తలతురు, కృపణులు (బ్రాహ్మణులకు విపరీతమైనవారు) పదే పదే ఇంద్రియభోగము ననుభవించినను తృప్తిచెందరు. కాని ధీరులు స్థిరబుద్ధి కలవారు, ఆ కండూతిని ఓర్చుకొనువారునై మూర్ఖులు, మూఢులకు కలిగెడి కష్టపరంపరకు గురి కాకుందురు.

46 మౌనవ్రతశ్రుతతపో౦ధ్యయన స్వధర్మ వ్యాఖ్యారహో జపసమాధయ ఆపవర్గ్యాః | ప్రాయః పరం పురుష తే త్వజితేన్డ్రియాణాం వార్తా భవన్త్యుత న వాత్ర తు దాంభికానాం || ఓ పరమపురుషా! ఎవ్వరితోను మాట్లాడక మౌనముగా నుండుట, ప్రతపాలనము, వేదజ్ఞాన సముపార్జనము, తపము, వేదశాస్త్రాధ్యయనము, వర్ణాశ్రమధర్మ నిర్వహణము, శాస్త్రవ్యాఖ్య, ఏకాంతవాసము, మౌనజపము, సమాధియను పదిపద్దతులు మోక్షసాధనములుగా చెప్పబడినవి. సాధారణముగా ఈ పద్ధతులు కేవలము వ్యాపారము కొరకు ఉపయోగపడుచు అజితేంద్రియులకు జీవికయై యుండును. అట్టివారు డాంబికులై యుందురు కనుక ఆ పద్ధతులు సఫలములు కూడా కాకపోవచ్చును.

47 రూపే ఇమే సదసతీ తవ వేదసృష్టే బీజాంకురావ న చాన్యదరూపకస్య | యుక్తాః సమక్షముభయత్ర విచక్షస్తే త్వాం యోగేన వహ్నిమివ దారుషు నాన్యతః స్యాత్ ||| జగత్తునందలి కార్యకారణ రూపములను మనుజుడు ప్రామాణికమగు వేదజ్ఞానము ద్వారా భగవంతునికి చెందినవిగా గాంచగలడు, ఏలయనగా ఈ జగత్తు భగవచ్ఛక్తియే అయియున్నది. కార్యకారణములు రెండును భగవంతుని శక్తులే అయియున్నవి. కనుక ఓ దేవా! కార్యకారణముల నెరిగిన బుద్ధిమంతుడు కాష్ఠమందు అగ్ని ఎట్లు వ్యాప్తమై యున్నదో గాంచెడి రీతి. భక్తియుత సేవా తత్పరులు ఏ విధముగా నీవు కార్యకారణములు రెండును అయియున్నావో ఎరుగగలరు.

48 త్వం వాయురగ్నిరవనిర్వియదమ్బు మాత్రాః ప్రాణేన్డ్రియాణి హృదయం చిదనుగ్రహశ్చ | సర్వం త్వమేవ సగుణో విగుణశ్చ భూమన్ నాన్యత్ త్వదస్త్యపి మనోవచసా నిరుక్తమ్ | దేవదేవా! వాస్తవమునకు నీవే వాయువు, ధరణి, అగ్ని, ఆకాశము, జలము అయియున్నావు. తన్మాత్రలు, ప్రాణము, పంచేంద్రియములు, మనస్సు, చిత్తము, అహంకారము కూడా నీవే. నిజముగా నీవే స్థూలసూక్ష్మాది సమస్తము అయి యున్నావు. భౌతికతత్త్వములు గాని, మనోవాక్కులచే వెల్లడి యగు ఏదేని గాని నీ కన్నను అన్యము కాదు..

49 నైతే గుణా న గుణినో మహదాదయో యే సర్వే మనః ప్రభృతయః సహదేవమర్త్యాః | ఆద్యస్తవన్త ఉరుగాయ విదన్తి హి త్వా- మేవం విమృష్య సుధియో విరమన్తి శబ్దాత్ || త్రిగుణములు (సత్త్వరజస్తమోగుణములు) కాని, త్రిగుణములకు అధిష్ఠాన దేవతలు గాని, పంచభూతములు గాని, మనస్సు గాని, జననమరణశీలురైన దేవతలు మానవులు గాని నిన్ను ఎరుగజాలరు. దీనిని గమనించియే ఆధ్యాత్మికముగా పురోగమించినవారలు భక్తియోగమును చేపట్టియుండిరి. అట్టి బుద్ధిమంతులు వేదాధ్యయనమును విరమించి నీ ప్రత్యక్షమగు భక్తియుత సేవలో నెలకొనుచున్నారు.

50 తత్ తేర్హత్తమ నమః స్తుతికర్మపూజాః కర్మ స్మృతిశ్చరణయోః శ్రవణం కథాయామ్ | సంసేవయా త్వయి వినేతి షడఙ్గయా కిం భక్తిం జనః పరమహంసగతౌ లభేత |॥ కనుక ఓ పూజ్యతమ దేవదేవా! నీకు నా వందనముల నర్పించుచున్నాను. స్తుతించుట, కర్మఫలముల నర్పించుట, నిన్ను అర్చించుట, నీ పక్షమున పని చేయుట, సదా నీ చరణారవిందములనే స్మరించుట, నీ మహిమలను వినుట యనెడి ఆరు విధములగు భక్తియుత కార్యములు లేకుండ ఎవ్వడు పరమహంసలకు ఉద్దేశింపబడిన లాభమును పొందగలడు?
Tags