గసడదవాదేశ సంధి ప్రధమా విభక్తి ప్రత్యయాలకు తర్వాత ఉన్న పరుషాలకు గ, స, డ, ద వ లు బహుళంగా వస్తాయి. ఉదా: 1. నదులు +త్రావవు = నదులుద్రావవు 2. వర్షధార + పోలె = వర్షధారవోలె
గసడదవాదేశ సంధి 2. ద్వంద్వ సమాసంలోని మొదటిపదం తరువాత గల పరుషాలకు గ, స,డ, ద వ లు బహుళంగా వస్తాయి. ఉదా: 1. తల్లి +తండ్రులు = తల్లితండ్రులు 2. కూర +కాయలు = కూరగాయలు
సరళాదేశ సంధి దృతప్రకృతం మీద పరుషాలకు సరళాలు వస్తాయి(౦, (, న్) ఉదా: తలన్ + తాల్చి = తల(దాల్చి
త్రిక సంధి ఆ, ఈ, ఏ అను సర్వ నామాలు త్రికములు అనబడును ఉదా: ఆ + కన్య = అక్కన్య
త్రికంబుమీది అసంయుక్త హల్లునకు ద్విత్వంబు బహుళముగానగు. ఉదా : ఈ + విధం = ఇవ్విధం ద్విరుక్తమైన హల్లు పరమైనపుడు ఇచ్చికమైన దీర్ఘానికి హ్రస్వంబగు ఉదా: ఏ + కడ = ఎక్కడ త్రిక సంధి
రుగాగమ సంధి పేదాదిశబ్ధాలకు ఆలు శబ్ధం పరమైతే కర్మధారయ సమాసంలో రుగాగమం వస్తుంది. ఉదా: పేద + ఆలు = పేదరాలు
యడాగమసంధి సంధి జరగని చోట అచ్చుకంటే పరంగా ఉన్న అచ్చునకు యడాగమం వస్తుంది. ఉదా: నీ + అంతరంగము = నీయంతరంగము
సంస్కృత సంధులు
సవర్ణదీర్ఘసంధి అ, ఇ, ఉ, ఋ లకు అవే అచ్చులు పరమైనచో వాటి దీర్ఘాలు ఏకాదేశమగును. ఉదా: ప్రళయ + అగ్ని = ప్రళయాగ్ని కవి + ఇంద్ర = కవీంద్ర గురు + ఉపదేశం = గురూపదేశం పితృ + ఋణం = పితౄణం
గుణ సంధి అకారమునకు ఇ, ఉ, ఋ లు పరమైనపుడు క్రమంగా ఏ, ఓ, అర్ లు ఏకాదేశమగును. ఉదా: గజ + ఇంద్ర = గజేంద్ర సూర్య + ఉదయం = సూర్యోదయం దేవ + ఋషి = దేవర్షి.
యణాదేశ సంధి ఇ, ఉ, ఋ లకు అ సవర్ణములైన అచ్చులు పరమైతే క్రమంగా య, వ, ర, లు ఆదేశమగును. ఉదా: ప్రతి + అక్షం = ప్రత్యక్షం అణు + అస్త్రం = అణ్వస్త్రం పితృ + అంశ=పిత్రంశ
వృద్ధి సంధి అకారానికి ఏ, ఐ లు పరమైతే "ఐ" కారము, ఓ, ఔ లు పరమైతే అఔకారము, ఋ, ౠ లు పరమైతే ఆర్ ఆదేశంగా వస్తాయి. ఉదా: భువన +ఏక = భువనైక పాప + అఔఘం = పాపౌఘం ఋణ + ఋణం = ఋణార్ణం
అనునాసిక సంధి క, చ, ట, త, ప ల కు "నమ" లు పరమైతే వాటి అను నాసికాక్షరాలు వికల్పంగా వస్తాయి. ఉదా: వాక్ + మహిమ = వాఙ్మహిమ జగత్ + మాత = జగన్మాత.