CuriousEd.ai అందిస్తున్న గృహం పాఠం చిన్నారుల కోసం రూపొందించిన సరళమైన తెలుగు పాఠం. ఇంటి అందం, పూలతోట, దీపావళి పండుగ వాతావ...
CuriousEd.ai అందిస్తున్న గృహం పాఠం చిన్నారుల కోసం రూపొందించిన సరళమైన తెలుగు పాఠం. ఇంటి అందం, పూలతోట, దీపావళి పండుగ వాతావరణం, అలంకరణ, ఆనందం వంటి విషయాలను చిత్రాలతో కలిపి పిల్లలకు అర్థమయ్యేలా వివరించబడింది. ఇది 1వ తరగతి విద్యార్థుల తెలుగు పఠనం, అర్థం చేసుకోవడం, పండుగల ఆనందాన్ని తెలుసుకోవడంలో సహాయపడుతుంది.
పాఠం:గృహం
ఇంటినే గృహం అని కూడా అంటారు.
రామయ్యది పెద్ద గృహం. ఆ గృహం
ముందు పూలతోట ఉన్నది. తోటలో
ఎన్నో రకాల అందమైన పూలు
పూస్తాయి.
దీపావళి పండుగ వచ్చింది. తోటలోని
బంతిపూలు తెచ్చారు. బంతిపూల
దండలు కుచ్చారు. ఆ దండలతో
గృహాన్ని అందంగా అలంకరించారు.
పండుగ సందడితో, మతాబులతో ఆ
గృహం కళకళలాడింది.